Thursday, December 17, 2009

యాసిడ్ భూతం

అప్పుడు నేను ఒక ప్రముఖ ఛానల్లో వీడియో ఎడిటర్ గా పనిచేస్తున్నాను.నేను యుక్తవయస్సులొ వున్న రోజులు.అంతా నాకు తెలుసు అనుకునే మూర్ఖుడ్ని అప్పుడు.ఒక రోజు వ్యవసాయ యూనివర్సిటీలొ అనుకుంటాను"ఒక వెధవ, అమాయకురాలైన అమ్మాయిపై యాసిడ్ పోసాడు.ఇందులొ చెప్పటానికి ఏమి వుంది?ఇలాంటివి ప్రతిరోజు జరుగుతూనే వున్నయి కదా అనుకోవచ్చు.కాని ఇప్పుడు నేను చెపుతున్న(సారీ వ్రాస్తున్న)ఈ స్టోరి చాలా పాతది.అప్పుడు నేను ఎడిటింగ్ గదిలొ వున్నాను.కెమెరామెన్ విజువల్స్ తీసుకొచ్చాడు.అన్ని చూసాను.దేనికైన స్పందించి ఆవేశంగా ఉపన్యాసాలు దంచెయ్యెడం అలవాటు.వయసు ప్రభావమేమో.అలాంటి నేను ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు.కనీసం నాతోటి ఫ్రెండ్స్ తో కూడా"చూడు వీడు ఎలా చేసాడో?ఇలా చేయడం తప్పు.ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది"అని కనీసం ఒక్కరితొ కుడా అనలేదు.తేదీలు మారాయి-రోజులు గడిచాయి.అందరిలాగె నేను కూడా ఆ సంఘటన గురించి మర్చిపోయాను.దైనందిన జీవితంలొ పడిపోయాను.ఒకటి లేక రెండు సంవత్సరాల తరువాత ఒక స్టోరి నా దగ్గరకి వచ్చింది.అన్ని స్టోరీలు చూసినట్లే కాజువల్ గా విజువల్స్ చూసాను.ఇద్దరమ్మాయిలు ఒక్కరె.ఆమె మొహం చుట్టూ గుడ్డ కప్పుకొని వుంది.సగం ఫేస్ కనిపించకుండా అడ్డుగా తెరలాంటి గుడ్డ.ఈ మీడియా దేన్ని వదలదు కదా.చచ్చే వాడితొ కూడా నువ్వెలా చనిపొతున్నావ్??ఇప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి??నీకు స్వర్గం కనిపిస్తున్నదా,నరకం కనిపిస్తున్నదా?రెండిట్లో దేనికి వెల్తావని నీకు నమ్మకం వుంది.అంటూ వాన్ని అక్కడే చంపేస్తారు.మీడియా గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మీకు అంతా తెలుసు.కాని ఇప్పట్లా అప్పుడు ఇన్ని న్యూస్ ఛానెల్స్ లేవు.వుండేవి రెండు మాత్రమే.కాని మా కెమెరామెన్ తెలివైన వాడు అనుకుంటాను.మొత్తానికి ఆమె ఫేస్ క్లియర్ గా విజువల్స్ లొ చూపించాడు.ఒక్క క్షణం షాక్ కొట్టినట్లు అయిపోయాను.బాడీ ఫ్రీజ్ అయింది.ఆమె ఫేస్ సగం వరకు బాగా కాలిపోయివుంది. వెంట్రుకలు కూడా దెబ్బతిన్నాయి.చాలా డల్ గా మాట్లాడింది.అప్పుడు చాల బాధేసింది.ఎంతంటె...చాలా...చాలా .ఆమెకు అప్పటికె చాలా ప్లాస్టిక్ సర్జెరీలు జరిగాయి.గవర్నమెంట్ ప్రకటించిన ఆర్థిక సాయం ఆమెకు సరిగ్గా అందలేదు.నాన్న ఆ డబ్బుల గురించి ప్రతి రోజు గవర్నమెంట్ ఆఫీస్ల చుట్టు తిరుగుతున్నాడు.ఆ అమ్మాయి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి.తను బయటికి వెల్లలేదు.నలుగురితొ ఫ్రీగా మట్లాడలేదు.ఆ షాక్ నుంచి ఆమె పూర్తిగా కోలుకోలేదు.మామూలు మనిషి ఒక చిన్న సర్జెరీకే బెంబేలెత్తి పోతాడు. అలాంటిది ఆపరేషన్స్ పైన ఆపరేషన్స్.ఒక పోకిరి రౌడి వెధవ చేసిన ఒక పరమ చెత్త పని,ఒక కుటుంబాన్ని నాశనం చేసింది.ఇప్పటికి ఆలోచిస్తుంటాను"తను ఇప్పుడు ఎలా వుంది"అని.ఇలాంటి వార్తలు చదివినప్పుడు గుండెల్లొ చిన్న బాధ"వీటిల్ని ఆపడానికి మనం ఏమి చెయ్యలేమా?".బుక్స్ బాగా చదివే అలవాటున్న నేను,చదివే ప్రతి పుస్తకంలొ ఈ టాపిక్ పైన ఏదైన కథ వుందేమో అని వెతుకుతుంటాను.రచయిత ఈ సమస్యకు ఏ పరిష్కారం చూపుతాడు అని ఆలోచిస్తాను.కాని ఇంతవరకు నేను అలాంటి కథ చదవలేదు.మీ దగ్గరుంటె పంపించండి.